Amber Heard: ఎలాన్ మస్క్ తో ఇల్లీగల్ సంబంధమే హాలీవుడ్ భామ అంబర్ హెర్డ్ జీవితాన్ని నాశనం చేసిందా?

- నటి అంబర్ హెర్డ్, ఎలాన్ మస్క్ మధ్య గతంలో బంధం
- అంబర్ హెర్డ్ ట్విట్టర్ ఖాతా కనిపించకపోవడంపై ఊహాగానాలు
- పాత గొడవల నేపథ్యంలో మస్కే ఖాతా తొలగించారని వదంతులు
ప్రముఖ హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ల మధ్య గతంలో నడిచిన వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి, దానికి 'ఎక్స్' అని పేరు మార్చిన తర్వాత అంబర్ హెర్డ్ ఖాతా కనిపించకుండా పోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పాత సంబంధాల నేపథ్యంలో మస్కే ప్రతీకారంగా ఆమె ఖాతాను తొలగించి ఉంటారనే ఊహాగానాలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.
హాలీవుడ్ స్టార్, 'పైరేట్స్ ఆఫ్ కరేబియన్' సిరీస్ సినిమాల హీరో జానీ డెప్‌తో వివాహం, ఆ తర్వాత విడాకులు, గృహ హింస ఆరోపణలతో అంబర్ హెర్డ్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. జానీ డెప్‌తో వివాద సమయంలో, అలాగే విడిపోయిన తర్వాత కూడా అంబర్ హెర్డ్, ఎలాన్ మస్క్‌ల మధ్య సన్నిహిత సంబంధం ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదని, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయనే కూడా ప్రచారం జరిగింది.
కొంతకాలం క్రితం ఎలాన్ మస్క్‌ను అంబర్ హెర్డ్ దూరం పెట్టారని, ఆమెను ట్విట్టర్‌లో బ్లాక్ కూడా చేశారని కొన్ని రూమర్స్ వినిపించాయి. అంబర్ హెర్డ్‌పై ఒకరకమైన కక్ష సాధింపు చర్యకు మస్క్ పాల్పడ్డారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మస్క్‌ను విమర్శిస్తూ, 'మోస్ట్ ఇన్‌సెక్యూర్ మ్యాన్' అని కామెంట్ చేస్తుండగా, మరికొందరు "థాంక్ గాడ్... అంబర్, మస్క్‌తో పిల్లలను కనలేదు" అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
జానీ డెప్‌తో కేసులో ఓడిపోయిన తర్వాత కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంబర్ హెర్డ్, ప్రస్తుతం తిరిగి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ తరుణంలో ఆమె ఎక్స్ (ట్విట్టర్) ఖాతా మాయం కావడంపై జరుగుతున్న ఈ ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది.