TCS on Luxury Items: ల‌గ్జ‌రీ వ‌స్తువుల విక్ర‌యాల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

India Imposes 1 TCS on Luxury Goods

  • రూ. 10 ల‌క్ష‌లు అంత‌కంటే ఎక్కువ ఖ‌రీదు చేసే ల‌గ్జ‌రీ వ‌స్తువుల‌పై 1 శాతం టీసీఎస్
  • ఈ మేర‌కు ఆదాయ‌పు ప‌న్ను విభాగం ప్ర‌క‌ట‌న‌
  • ఈ నెల 22 నుంచే ఇది అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డి

ల‌గ్జ‌రీ వ‌స్తువుల విక్ర‌యాల‌పై కేంద్రంలోని ఎన్‌డీఏ స‌ర్కార్‌ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రూ. 10 ల‌క్ష‌లు అంత‌కంటే ఎక్కువ ఖ‌రీదు చేసే చేతి గ‌డియారాలు, బ్యాగులు వంటి వాటిపై 1 శాతం టీసీఎస్ (Tax Collected at Cource) వ‌సూలు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నెల 22 నుంచే ఇది అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు ఆదాయ‌పు ప‌న్ను విభాగం నేడు (ఏప్రిల్ 23) ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

చేతి గ‌డియారాలు, హ్యాండ్‌ బ్యాగులు, రేసింగ్ గుర్రాలు, శిల్పాలు, పెయింటింగ్స్, హై ఎండ్ స్పోర్ట్స్ వేర్‌, హోం థియేట‌ర్ సిస్టమ్స్‌, స‌న్‌గ్లాసెస్, పాద‌ర‌క్ష‌లు త‌దిత‌ర ల‌గ్జరీ వ‌స్తువుల‌కు ఈ టీసీఎస్ వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. ఇక తాజా నిర్ణ‌యంతో విక్ర‌య‌దారులు త‌ప్ప‌నిస‌రిగా టీసీఎస్ నిబంధ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. 

అలాగే ఈ నిర్ణ‌యంతో ల‌గ్జ‌రీ వ‌స్తువుల అమ్మ‌కాల‌పై నియంత్ర‌ణ ఉంటుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అధిక విలువ క‌లిగిన వ‌స్తువుల విక్ర‌యాల్లో పార‌ద‌ర్శ‌క‌త‌ను పెంచేందుకే కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. 

TCS on Luxury Items
NDA Government
Luxury Goods Tax
Luxury Watches Tax
Luxury Handbags Tax
India Tax Policy
Luxury Goods Market India
High-Value Goods Tax
  • Loading...

More Telugu News