PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ను రిమాండ్ కు పంపిన కోర్టు

PSR Anjaneyulu Sent to Remand in Jethwani Harassment Case

  • నటి జత్వానీ కేసులో వచ్చే నెల 7 వరకు రిమాండ్
  • బుధవారం పీఎస్ఆర్ ను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
  • కోర్టులో స్వయంగా వాదనలు వినిపించుకున్న పీఎస్ఆర్

బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీపై వేధింపులకు సంబంధించి నమోదైన కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 7 వరకు పీఎస్ఆర్ ను రిమాండ్ కు పంపుతూ బుధవారం కోర్టు తీర్పు వెలువరించింది. 

పీఎస్‌ఆర్ ను అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు బుధవారం ఉదయం థర్డ్ ఏసీజేఎమ్‌ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఛాంబర్‌లో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట లాయర్‌తో కలిసి పీఎస్ఆర్ స్వయంగా వాదనలు వినిపించారు. జత్వానీ కేసులో ఏం జరిగిందనే అంశాలను జడ్జికి వివరించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పాత్ర లేకపోయినా తన మీద కేసు పెట్టారని వాదించారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, తనకూ ఈ కేసుకు సంబంధం లేదని పీఎస్‌ఆర్ తెలిపారు.

PSR Anjaneyulu
Kadambari Jethwani
AP Intelligence Chief
Remand
Harassment Case
CID Police
Court Hearing
Bollywood Actress
False Case
Andhra Pradesh
  • Loading...

More Telugu News