Sri Srinivasulu Reddy: ఏపీలో నేడు టెన్త్ రిజల్ట్స్

- ఉదయం 10 గంటలకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల
- టెన్త్ రెగ్యులర్‌తో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల ఫలితాలు కూడా విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ రోజు (ఏప్రిల్ 23, బుధవారం) ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి ప్రకటన విడుదల చేశారు. టెన్త్ రెగ్యులర్‌తో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
కాగా, ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 6.19 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు.