Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్రదాడిలో హైదరాబాద్ ఎస్ఐబీ ఆఫీసర్ మృతి

కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మనీశ్ రంజన్ మృతిచెందారు. ఆయన కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)లో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పహల్గాం పర్యటనకు వెళ్లగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. భార్య, పిల్లల ఎదురుగానే ఆయనను కాల్చి చంపినట్లు సమాచారం. మనీశ్ ఐడీ కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని తెలుస్తోంది. బీహార్‌కు చెందిన మనీశ్... ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు.
ఇక, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఉగ్రదాడిలో దాదాపు 26 మంది పర్యాటకులు మృతిచెందినట్టు సమాచారం. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలువురు దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు.