Indian Stock Market: వరుసగా ఆరో రోజు లాభపడ్డ మార్కెట్లు

Indian Stock Market Records Sixth Consecutive Day of Gains

  • మార్కెట్లను ముందుండి నడిపించిన బ్యాంకింగ్ స్టాక్స్, ఎఫ్ఎంసీజీ సూచీలు
  • 187 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 41 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ సూచీలు లాభపడ్డాయి. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ రూ. 85.19గా ఉంది.

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్ల లాభంతో 79,595 కి పెరిగింది. నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 24,167 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (2.58), హిందుస్థాన్ యూనిలీవర్ (2.06), మహీంద్రా అండ్ మహీంద్రా (1.89), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.78), కోటక్ బ్యాంక్ (1.11).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.88), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.30), ఇన్ఫోసిస్ (1.93), భారతి ఎయిర్ టెల్ (1.68), బజాజ్ ఫిన్ సర్వ్ (1.25).

Indian Stock Market
Sensex
Nifty
Stock Market Gains
Banking Stocks
FMCG Stocks
Top Gainers
Top Losers
Rupee Value
Market Trends
  • Loading...

More Telugu News