Black White and Grey - Love Kills: సోనీలివ్ లో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్!

- టైటిల్ తో ఆసక్తిని రేకెత్తించిన సిరీస్
- మే 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్
- మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ
- ఆడియన్స్ లో పెరుగుతున్న ఉత్కంఠ
సోనీలివ్ ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ పలకరించడానికి రెడీ అవుతోంది. ఆ సిరీస్ పేరే 'బ్లాక్ వైట్ అండ్ గ్రే - లవ్ కిల్స్'. స్వరూప్ సంపత్, హేమల్ ఠక్కర్ నిర్మించిన ఈ సిరీస్ కి, పుష్కర్ సునీల్ మహాబల్మ్ దర్శకత్వం వహించారు. 'అన్ని ప్రేమకథలు చరిత్ర సృష్టించవు... కొన్ని క్రైమ్ రిపోర్ట్స్ గా మారతాయి' అనే లైన్ ఈ సిరీస్ పై అందరిలో ఆసక్తిని పెంచింది.
టిగ్మాన్షు ధులియా-మయూర్ మోర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, మే 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. పాలక్ జైస్వాల్, దేవేన్ భోజనీ, ఎడ్వర్డ్ సోన్నెన్ బ్లిక్, హకీమ్ షాజహాన్, కమలేశ్, అనంత్ జోగ్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఒక్కసారిగా అందరిలో అంచనాలు మొదలయ్యాయి.
ఆర్ధికంగా వెనుకబడిన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ యువకుడికి ఒక యువతితో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఒకరాత్రివేళ ఇద్దరూ కలిసి కార్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఆమె హఠాత్తుగా చనిపోతుంది. ఆమె ఒక పేరున్న రాజకీయ నాయకుడిగా కూతురు కావడంతో, పోలీసులు రంగంలోకి దిగుతారు. ఆమె ఎందుకు చనిపోతుంది? అందువలన ఆ యువకుడికి ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి? అనేది కథ.