Tarunam: ప్రియురాలి ఇంట్లో శవం .. ఓటీటీలో రొమాంటిక్ థ్రిల్లర్!

- తమిళంలో విడుదలైన 'తరుణం'
- ప్రధాన పాత్రల్లో స్మృతి వెంకట్ - కిషన్ దాస్
- ఈ నెల 25 నుంచి టెంట్ కొట్టలో స్ట్రీమింగ్
- శవం చుట్టూ తిరిగే కథ
కిషన్ దాస్ - స్మృతి వెంకట్ ప్రధానమైన పాత్రలను పోషించిన తమిళ సినిమానే 'తరుణం'. పుగళ్ నిర్మించిన ఈ సినిమాకి అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. జనవరి 31వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. అక్కడ ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'టెంట్ కొట్ట' ఓటీటీవారు దక్కించుకున్నారు.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ సినిమాను ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. థియేటర్లలో విడుదలైన తరువాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుని వస్తున్న సినిమా ఇది. దర్బుక శివ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ రావొచ్చనే ఒక టాక్ వినిపిస్తోంది. ఒక వైపున క్రైమ్ .. మరో వైపున సస్పెన్స్ ను టచ్ చేస్తూ సాగే రొమాంటిక్ లవ్ స్టోరీ కావడం వలన యూత్ కుతూహలంతో ఉంది.
కథలోకి కన్నేస్తే .. "అర్జున్ - మీరా ఒక పెళ్ళిలో కలుసుకుంటారు. అక్కడ మొదలైన వారి పరిచయం, పెద్దగా సమయం తీసుకోకుండానే ప్రేమగా మారిపోతుంది. ఒక రోజున మీరా ఇంటికి వెళ్లిన అర్జున్ కి, అక్కడి కిచెన్ లో ఒక శవం కనిపిస్తుంది. ఆ శవాన్ని మాయం చేయడానికి అతని సాయం కోరుతుంది మీరా. ఆ డెడ్ బాడీ ఎవరిది? ఎందుకు మీరా ఇంట్లో ఉంది? ఆ శవం కారణంగా వాళ్లకి ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి? అనేది కథ.