Shaheen Afridi: హెయిర్ డ్రయర్, ట్రిమ్మర్ కాదు... ఆ కెప్టెన్‌కు గోల్డెన్ ఐఫోన్ గిఫ్ట్!

పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆటగాళ్లకు హెయిర్ డ్రయర్, ట్రిమ్మర్లు గిఫ్ట్స్‌గా ఇచ్చి కరాచీ ఫ్రాంచైజీ యాజమాన్యం విమర్శల పాలైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా అందుకు భిన్నంగా లాహోర్ ఖలందర్స్ జట్టు యాజమాన్యం... తమ టీమ్ కెప్టెన్ షాహీన్ అఫ్రిదీకి కస్టమైజ్డ్ 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటెడ్ యాపిల్ ఐఫోన్ 16ప్రో గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది. దీని ధర గరిష్ఠంగా రూ. 3లక్షల నుంచి రూ. 3.5 లక్షలు ఉంటుందట. ఇందుకు సంబంధించిన వీడియోను లాహోర్ ఫ్రాంచైజీ తమ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. కాగా, ఈ సీజన్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టు అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి, 2 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.