Ashu Reddy: బ్రెయిన్ సర్జరీ నుంచి కోలుకుంటున్న అషురెడ్డి .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Telugu Actress Ashu Reddys Brave Fight After Brain Surgery
  • చేసేది ఏదో మొత్తం చేస్తే బాగుండేది కానీ అరగుండు చేశారన్న అషూరెడ్డి
  • వీడియోను ఇన్స్ స్టాలో షేర్ చేసిన అషూరెడ్డి
  • సర్జరీ అయిన రెండు నెలలోనే సెట్ లోకి వచ్చిన వైనం
బిగ్ బాస్ బ్యూటీ, నటి అషూరెడ్డికి గత ఏడాది బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న ఆమె షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్‌లో తన సర్జరీకి సంబంధించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియోను పంచుకుంది. "ఇదే కదా జీవితమంటే.. దయచేసి ఇతరుల పట్ల దయతో ప్రవర్తించండి. ఎగిరెగిరి పడకుండా ఒదిగి ఉండటం నేర్చుకోండి. దాని వల్ల చాలా మంది బాగుపడతారు" అని క్యాప్షన్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీనిపై అభిమానులు స్పందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. "నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నీకు ఆ భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు ఒక ఫైటర్‌వి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత వైద్యులు ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా రెండు నెలలకే ఆమె షూటింగ్‌లకు సిద్ధమై సెట్స్‌లోకి అడుగు పెట్టింది. వర్క్‌లో బిజీగా ఉండటం వల్లే తాను కోలుకుంటున్నానని అషూ చెబుతోంది.

ఓ షోలో ఇటీవల పాల్గొన్న అషూ రెడ్డి తన బ్రెయిన్ సర్జరీ గురించి వివరిస్తూ భావోద్వేగానికి గురైంది. ఆపరేషన్ సమయంలో తలపై జుట్టు తీసేశారని, అదేదో పూర్తిగా తీసేసినా బాగుండేది కానీ అరగుండు చేశారని బాధను వ్యక్తం చేసింది. ఆ సమయంలో అద్దంలో తన ముఖం చూసుకుని ఇక కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నానని కన్నీళ్లు పెట్టుకుంది.

డబ్‌స్మాష్ వీడియోలతో పాప్యులర్ అయిన అషూ రెడ్డి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక్కసారిగా హైలైట్ అయ్యారు. ఆ క్రమంలోనే బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొనడంతో పాటు ఆ తర్వాత ఓటీటీలో బిగ్ బాస్ నాన్‌స్టాప్ సీజన్‌లోనూ అవకాశం దక్కించుకుంది. చల్ మోహన్ రంగ, బాయ్ ఫ్రెండ్స్ ఫర్ హైర్, ఏ మాస్టర్ పీస్ మూవీల్లో నటించింది. 
Ashu Reddy
Brain Surgery
Bigg Boss Telugu
Telugu Actress
Ashu Reddy Health Update
Brain Surgery Recovery
Telugu Television
Ram Gopal Varma
Viral Video
Social Media

More Telugu News