Jagan Mohan Reddy: రేపు జగన్ అత్యంత కీలక సమావేశం

- రేపు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక నేతల సమావేశం
- వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ స్టేట్ కోఆర్ఢినేటర్ గా సజ్జల
వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన రేపు ఆ పార్టీ కీలక సమావేశం జరగబోతోంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం రేపు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పొలిటికల్ అడ్వైజరీ సమావేశం జరగనుండటం ఇదే తొలిసారి.
ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ కీలక నేతలతో జగన్ చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇప్పటికే పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. 33 మందిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ కమిటీకి స్టేట్ కోఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తారని వైసీపీ కేంద్ర కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది.