Sunita: హైదరాబాద్ బండ్లగూడ రవాణా శాఖ అధికారిణి సునీతపై సీరియస్ యాక్షన్

Hyderabad RTO Officer Sunita Transferred Amidst Allegations
  • ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సునీతపై ఆరోపణలు
  • విచారణ జరిపి నివేదిక అందించిన అధికారులు
  • క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ వేటు
హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ దక్షిణ మండలం రవాణ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి సునీతపై ఆ శాఖ కమిషనర్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమెపై బదిలీ వేటు వేశారు. 

ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రవర్తన బాగోలేకపోవడం, పలు ఆర్థిక అంశాలలో నేరుగా ఆమె ప్రమేయం ఉండటం గురించి ఆమెపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. తదనంతరం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెపై బదిలీ వేటు పడింది. ఈ అంశంపై బండ్లగూడ ఆర్టీవో కృష్ణయ్య మాట్లాడుతూ... ఆమె బదిలీ జరిగిందని చెప్పారు. ఆమెను ఎస్టీఏకు అటాచ్ చేశారని తెలిపారు. 
Sunita
Hyderabad RTO
Bandlaguda RTO
Transfer Order
Administrative Officer
Disciplinary Action
Corruption Allegations
Financial Irregularities
Krishnayya RTO

More Telugu News