Kushi Ravi: ఆ ఇంట్లో అనుమానాస్పద మరణాలు .. 'జీ 5'లో క్రైమ్ థ్రిల్లర్!

- కన్నడలో రూపొందిన 'అయ్యన మనే'
- 1990లలో నడిచే కథ
- క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కంటెంట్
- ఈ నెల 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ జోనర్ కి చెందిన సిరీస్ లకు కూడా విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఇక దానికి తోడు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా యాడ్ అయితే, ఇక ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చే సిరీస్ గా 'అయ్యన మనే' కనిపిస్తోంది. ఈ నెల 25 నుంచి జీ 5లో ఈ కన్నడ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఖుషి రవి ప్రధానమైన పాత్రను పోషించిన సిరీస్ ఇది. ఇతర ముఖ్య పాత్రలలో అక్ష్య నాయక్ .. మానసి సుధీర్ .. విజయ్ శోభరాజ్ .. కనిపిస్తారు. శృతినాయుడు నిర్మించిన ఈ సిరీస్, 1990ల కాలంలో .. ఒక ఉమ్మడి కుటుంబం నివసించే బంగ్లా చుట్టూ తిరుగుతుంది. పోస్టర్స్ తోనే ఈ సిరీస్ అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కంటెంట్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ మరింత కుతూహలాన్ని కనబరుస్తున్నారు.
రమేశ్ ఇందిర దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. చిక్ మగ్ ళూర్ లోని ఒక భవనంలో 'అయ్యన మనే' కుటుంబం నివసిస్తూ ఉంటుంది. ఆ ఇంటికి కోడలిగా వచ్చిన ముగ్గురు యువతులు ఒకరి తరువాత ఒకరుగా చనిపోతారు. ఈ విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు దాచేస్తారు. నాలుగో కోడలిగా అడుగుపెట్టిన ఖుషి రవి, ఈ రహస్యాన్ని ఛేదించాలని అనుకుంటుంది. ఆ ప్రయత్నంలో ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ.
