Vikram: ఓటీటీలో విక్రమ్ 'వీర ధీర శూరన్'

- విక్రమ్ నుంచి రీసెంటుగా వచ్చిన మూవీ
- యాక్షన్ డ్రామా జోనర్లో నడిచే కథ
- కీలకమైన పాత్రలో దుషారా విజయన్
- ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్
విక్రమ్ కథానాయకుడిగా రూపొందిన 'వీర ధీర శూరన్' మార్చి 27వ తేదీన థియేటర్లకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, దుషారా విజయన్ .. సూరజ్ వెంజరమూడు .. పృథ్వీరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది.
విక్రమ్ కి సరైన హిట్ పడక చాలా కాలమైంది. అలాంటి విక్రమ్ కి ఈ సినిమా ఫలితం కొంతవరకూ ఊరట కలిగించిందనే చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో దుషారా విజయన్ కి మంచి మంచి పాత్రలు పడ్డాయి. తెలుగు ప్రేక్షకులకు ఆమె మరింత చేరువైంది. చాలా తక్కువ కాలంలోనే ఆమె విక్రమ్ సరసన నాయికగా చేయగలిగింది. ఇక తెలుగులో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టలేకపోయినా, చూసినవాళ్లు మంచి మార్కులే ఇచ్చారు. ఈ నెల 24 నుంచి ఈ సినిమా ఐదు భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
కథ విషయానికి వస్తే .. "కాళీ (విక్రమ్) తన భార్యాపిల్లలతో కలిసి హ్యాపీగా బ్రతుకుతూ ఉంటాడు. అతను చాలా సాఫ్ట్ గా కనిపిస్తూ కిరాణాషాపు నడుముతున్నప్పటికీ, ఆయన గతం వేరు. ఆ గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న అతని దగ్గరికి రవి వస్తాడు. పోలీస్ ఆఫీసర్ అరుణగిరిని అంతం చేయమని కోరతాడు. అరుణగిరి ఎవరు? అతనితో రవికి గల శత్రుత్వం ఏమిటి? ఎందుకు అతను కాళీని ఆశ్రయిస్తాడు? అనేది మిగతా కథ.
