Kalvakuntla Kavitha: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో కవిత

Kalvakuntla Kavitha Visits Bhadhrachalam Temple

  • భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న కవిత
  • పూర్ణకుంభంతో స్వాగతం పలికి అర్చకులు, అధికారులు
  • కవితతో పాటు స్వామిని దర్శించుకున్న పలువురు బీఆర్ఎస్ నేతలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి ఆలయానికి వచ్చిన కవితకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

స్వామివారి దర్శనానంతరం శ్రీ లక్షీ తాయారమ్మ వారి ఆలయంలో పండితులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా కవితతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, చంద్రావతి, రేగా కాంతారావు ఉన్నారు.

Kalvakuntla Kavitha
Bhadhrachalam
Sri Sita Ramachandra Swamy Temple
Special Poojas
Telangana Politics
BRS MLC
Vaddiraju Ravichandra
Bhadradri
Hari Priya
Chandrawati
  • Loading...

More Telugu News