Janavani: జ‌న‌సేన కీల‌క ప్ర‌క‌ట‌న‌

Jana Sena Party Announces Key Decision on Janavaani Program
  • జ‌న‌సేన 'జ‌న‌వాణి' కార్య‌క్ర‌మం ప‌ని వేళల్లో మార్పు
  • సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు కార్య‌క్ర‌మం
  • ఆయా రోజుల్లో ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు
  • కొన‌సాగింపుగా సాయంత్రం 4.30 గంట‌ల నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు 'జ‌న‌వాణి'
  • ఈరోజు నుంచే కొత్త ప‌ని వేళలు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని పార్టీ ప్ర‌క‌ట‌న‌
ఏపీ డిప్యూటీ సీఎం, జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌తంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు 'జ‌న‌వాణి' కార్య‌క్ర‌మాన్ని తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. వివిధ స‌మ‌స్య‌ల‌తో ఈ జ‌న‌వాణికి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ను స్వ‌యంగా జ‌న‌సేనాని క‌లిసి వారి నుంచి విన‌తి ప‌త్రాల‌ను తీసుకుని వాటిని ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. 

ఈ క్ర‌మంలో తాజాగా జ‌న‌సేన ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వేస‌వి కాలం నేప‌థ్యంలో 'జ‌న‌వాణి'కి వ‌చ్చే ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం ఈ కార్య‌క్ర‌మం ప‌నివేళ‌ల‌ను మార్చిన‌ట్లు పార్టీ ప్ర‌క‌టించింది. ఇక‌పై సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు, కొన‌సాగింపుగా సాయంత్రం 4.30 గంట‌ల నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. ఈ కొత్త ప‌ని వేళ‌లు ఇవాళ్టి (ఏప్రిల్ 21) నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని జ‌న‌సేన తెలిపింది. ఈ మేర‌కు మంగ‌ళ‌గిరి జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.   

Janavani
Pawan Kalyan
Jana Sena Party
Andhra Pradesh
AP Deputy CM
Public Grievances
New Timings
Party Announcement
Political News
India Politics

More Telugu News