Ravindra Jadeja: జడేజా, దూబే ఫిఫ్టీలు... మోస్తరు స్కోరు చేసిన సీఎస్కే

Jadeja Dube fifties power CSK to a modest total

  • చెన్నై సూపర్ కింగ్స్ × ముంబయి ఇండియన్స్
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు
  • జడేజా, శివమ్ దూబే ఫిఫ్టీలు
  • ఆకట్టుకున్న ఆయుష్ మాత్రే

ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (53 నాటౌట్), శివమ్ దూబే (50) అర్ధసెంచరీలతో రాణించగా, యువ ఆటగాడు ఆయుష్ మాత్రే ఆకట్టుకున్నాడు. 

ఓపెనర్ గా బరిలో దిగిన తెలుగు ఆటగాడు షేక్ రషీద్ 20 బంతుల్లో 1 ఫోర్ తో 19 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర (5) నిరాశపరిచాడు. ఈ దశలో ఆయుష్ మాత్రే 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు చేశాడు. 

శివమ్ దూబే 32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 50 పరుగులు చేయగా... జడేజా 35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో బుమ్రా 2, దీపక్ చహర్ 1, అశ్వనీకుమార్ 1, శాంట్నర్ 1 వికెట్ తీశారు.

Ravindra Jadeja
Shivam Dube
CSK vs MI
IPL 2023
Chennai Super Kings
Mumbai Indians
Jadeja fifty
Dube fifty
Ayush Badoni
Cricket
  • Loading...

More Telugu News