Royal Challengers Bangalore: పంజాబ్ కింగ్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన ఆర్సీబీ బౌలర్లు

- ఐపీఎల్ లో ఇవాళ డబుల్ హెడర్
- తొలి మ్యాచ్ లో ఆర్సీబీ × పంజాబ్ కింగ్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసిన పంజాబ్
పంజాబ్ కింగ్స్ తో పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుతంగా రాణించారు. పంజాబ్ కింగ్స్ ను వారి సొంతగడ్డపైనే తక్కువ స్కోరుకు పరిమితం చేశారు. ఐపీఎల్ డబుల్ హెడర్ లో ఇవాళ తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ ఆడుతున్నాయి.
ఛండీగఢ్ లో జరుగుతున్న ఈ పోరులో బెంగళూరు టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులే చేసింది. ప్రియాన్ష్ ఆర్య 22, ప్రభ్ సిమ్రన్ సింగ్ 33, జోష్ ఇంగ్లిస్ 29, శశాంక్ సింగ్ 31, మార్కో యన్సెన్ 25 పరుగులు చేశారు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 6 పరుగులకే అవుట్ కాగా, నేహల్ వధేరా (5), మార్కస్ స్టొయినిస్ (1) నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా 2, సుయాష్ శర్మ 2, రొమారియా షెపర్డ్ 1 వికెట్ తీశారు.