Chandrababu Naidu: అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడు అంటూ వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Wishes Chandrababu Naidu on 75th Birthday

  • నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు వేడుకలు
  • ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి
  • పవన్ కల్యాణ్ 
  • కుటుంబ సభ్యులతో యూరప్ లో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడు అంటూ వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై, శాంతిభద్రతలు క్షీణించిపోయిన రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపచేయడం నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమని అన్నారు. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని మరోసారి తెలిపారు.

నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమని పవన్ కొనియాడారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వజ్రోత్సవ జన్మదిన శుభసమయాన ఆయనకు సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ అన్నారు.

కాగా, చంద్రబాబు నాయుడు ఈరోజు యూరప్‌లో కుటుంబ సభ్యుల మధ్య 75వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. మరోపక్క ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసింది. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు చేయాలని మంత్రి అనం రామనారాయణ రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 

Chandrababu Naidu
Pawan Kalyan
75th Birthday
Andhra Pradesh
TDP
AP CM
Politics
India
Birthday Wishes
Diamond Jubilee
  • Loading...

More Telugu News