IMD: కొనసాగుతున్న ఉపరితల ద్రోణి... ఏపీకి వర్ష సూచన

Andhra Pradesh Rain Forecast Surface Trough Brings Showers
  • మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు ద్రోణి
  • సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి
  • ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. 

కాగా, ద్రోణి ప్రభావంతో  కోస్తాంధ్రలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ సంస్థ పేర్కొంది. రాయలసీమలోనూ ఇదే తరహాలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 25 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

కాగా, ఏపీలో రాగల 4 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని, ఆ తర్వాత స్వల్పంగా తగ్గవచ్చని ఐఎండీ వివరించింది. 
IMD
India Meteorological Department
Surface trough
Andhra Pradesh weather
Coastal Andhra Pradesh
Rayalaseema weather
Rain forecast
Thunderstorms
Strong winds
Temperature forecast

More Telugu News