Mohammad Azharuddin: ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగింపు!

- హెచ్‌సీఏను ఆదేశించిన అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య
- లార్డ్స్ క్లబ్ వేసిన పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన జస్టిస్ ఈశ్వరయ్య
- టిక్కెట్లపై ఇక నుంచి అజారుద్దీన్ పేరు ప్రస్తావన ఉండవద్దని స్పష్టీకరణ
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు మాజీ క్రికెటర్, ప్రముఖ రాజకీయ నాయకుడు అజారుద్దీన్ పేరును తొలగించాలని అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)ను ఆదేశించారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై ఆయన ఈ రోజు విచారణ చేపట్టారు.
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ తన పేరును పెట్టుకోవాలని నిర్ణయించుకొని, ఆ పేరు పెట్టారని, కానీ ఆ నిర్ణయం చెల్లదని అన్నారు. ఈ నిర్ణయంలో విరుద్ధమైన ప్రయోజనాలు ఉన్నాయని జస్టిస్ ఈశ్వరయ్య తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరును తొలగించాలని హెచ్‌సీఏను ఆదేశించారు. టిక్కెట్లపై కూడా ఇక నుంచి ఆ పేరు ప్రస్తావన ఉండవద్దని తేల్చి చెప్పారు.