Aghori: అఘోరీపై దళిత సంఘాల ఆగ్రహం

- అంబేద్కర్ పై అవమానకర వ్యాఖ్యలు చేసిన అఘోరీ
- మచిలీపట్నం పీఎస్ లో దళిత సంఘాల నేతల ఫిర్యాదు
- దళితులకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్
అఘోరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు నగ్నంగా ఆలయాల బాట పట్టిన అఘోరీ... ఇటీవల ఓ యువతిని పెళ్లి చేసుకుని అందరినీ షాక్ కు గురి చేసింది. మరోవైపు అఘోరీ ఎక్కడకు వెళితే అక్కడ స్థానిక నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తోంది.
తాజాగా అంబేద్కర్ ను ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేసింది. జుగుప్సాకరంగా మాట్లాడింది. దీంతో, అఘోరీపై దళిత సంఘాల నేతలు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టడమే కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అఘోరీపై చర్యలు తీసుకోవాలని, దళితులకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.