Unique Bowling Action: ఇంత చిత్రమైన బౌలింగ్ యాక్షన్ ఎక్కడా చూసి ఉండరు!

చిత్ర విచిత్రమైన బౌలింగ్ యాక్షన్ లకు శ్రీలంక క్రికెటర్లు పెట్టింది పేరు. ముత్తయ్య మురళీధరన్, లసిత్ మలింగ, మతీశ పతిరణ, ఎషాన్ మలింగ... ఈ కోవలోకే వస్తారు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ కుర్రాడి బౌలింగ్ చూస్తే... వీళ్లందరినీ మించిపోతాడు. ఏ చేత్తో బంతి విసురుతాడో అర్థం కానంత ఇదిగా బౌలింగ్ చేస్తున్నాడు.
అతడి బౌలింగ్ రనప్ మహా అయితే 10-15 అడుగులు ఉంటుందేమో... ఈ కాస్త నిడివిలోనే తన చేతులతో అనేక విన్యాసాలు చేసి, చివరికి బంతిని వేయగా, ఆ బ్యాట్స్ మన్ క్లీన్ బౌల్డ్ అవడం వీడియోలో చూడొచ్చు.
ఇక నెటిజన్లు అయితే ఈ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సన్ రైజర్స్ కు ఇలాంటి బౌలరే కావాలని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. కొందరేమో, వీడు బంగ్లాదేశ్ పాములా ఉన్నాడు అని సెటైర్లు వేశారు.