Donald Trump: భారతీయ రైతులా డొనాల్డ్ ట్రంప్.. ఆకట్టుకుంటున్న ఏఐ వీడియో ఇదిగో

- ఏఐ ద్వారా ట్రంప్‌ను వృద్ధ రైతులా సృష్టించిన వైనం
- సైకిల్ మీద గడ్డి మోపు, చెట్టు కింద కూర్చొన్ని సన్నిహితులతో ముచ్చట్లు పెడుతున్నట్లుగా వీడియో
- ఏఐ వీడియోపై నెటిజన్ల ప్రశంసలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ రైతుగా ఉంటే ఎలా ఉంటారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించిన ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అగ్రరాజ్య అధినేతను ఏఐ సాంకేతికతతో వృద్ధ రైతుగా రూపొందించారు.
ఈ వీడియోలో ఆయన సైకిల్‌పై గడ్డి మోపును పెట్టుకుని వెళుతున్నట్లు, పొలాల్లో ఆవును కట్టి తీసుకువెళుతున్నట్లు ఉంది. గ్రామంలో చెట్టు కింద స్నేహితులతో ముచ్చటిస్తున్నట్లు, తెల్లని దుస్తుల్లో పిల్లలకు దీపావళి టపాసులు కొనిస్తున్నట్లు కూడా ఏఐ ద్వారా సృష్టించారు.
ఈ వీడియోకు నేపథ్య సంగీతంగా 'బలగం' చిత్రంలోని "తెల్లాతెల్లాని పాలదారలల్లే పల్లె తెల్లవారుతుంటది రా.. గుళ్లోని గంటలు కాడెట్ల మెడలోన జంటగ మోగుతు ఉంటయ్ రా" అనే పాటను జత చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఏఐ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.