Revanth Reddy: మూసీ ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారు: జపాన్‌లో తెలుగువారితో రేవంత్ రెడ్డి

Revanth Reddy Criticizes Obstacles to Musi River Cleaning
  • తెలంగాణ ఫార్మా, ఐటీ రంగంలో సాధించాల్సిన ప్రగతిని సాధించిందన్న ముఖ్యమంత్రి
  • ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపు
  • ఢిల్లీని చూసి నేర్చుకోవాల్సి ఉందన్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సిన ప్రగతిని సాధించిందని అన్నారు.

ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. టోక్యోలోని సుమేధా నదిలో పడవలో ప్రయాణించామని, రివర్ ఫ్రంట్‌ను పరిశీలించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని, కానీ మనం ఢిల్లీని చూసి గుణపాఠం నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. మీ తోడ్పాటుతో ప్రపంచంతోనే పోటీ పడవచ్చని జపాన్‌లోని తెలుగువారిని ఉద్దేశించి అన్నారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం మీకు తెలుసని అన్నారు.

తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు తెలంగాణ పురోగతికి కీలకమని అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి, పరిశ్రమలు పెరిగి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని అన్నారు.
Revanth Reddy
Musi River Cleaning
Telangana Development
Japan Visit
Telugu Diaspora
Hyderabad
Dry Port
Metro Expansion
Regional Ring Road

More Telugu News