Golagani Hari Venkata Kumari: వైసీపీకి భారీ షాక్... విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం

Visakhapatnam Mayors Post Won by Kutami

  • మేయర్ పై పెట్టిన అవిశ్వాసంలో కూటమి ఘన విజయం
  • మేయర్ పదవిని కోల్పోయిన వైసీపీ
  • జీవీఎంసీ కార్యాలయం వద్ద కూటమి నేతల సంబరాలు

వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ కోల్పోయింది. జీవీఎంసీ వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. విశాఖ మేయర్ పీఠం కూటమి వశమయింది. 

ఈ ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ హరేంధిరప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమయింది. ఇప్పటికే వైసీపీ కార్పొరేట్లర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో కూటమి బలం పెరిగింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులు ఉన్నారు. ఈనాటి సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. వీరంతా అవిశ్వానికి మద్దతుగా ఓటు వేశారు. పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు వైసీపీ విప్ జారీ చేసినా వ్యూహం ఫలించలేదు.

మరోవైపు కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. దీంతో, వైసీపీ మేయర్ హరివెంకట కుమారి పదవిని కోల్పోయారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీ కార్యాలయం వద్ద కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని వేడుక చేసుకున్నారు.  

Golagani Hari Venkata Kumari
Visakhapatnam Mayor
GVM Corporation
No Confidence Motion
YCP
Opposition Coalition
Andhra Pradesh Politics
Municipal Elections
Indian Politics
Local Body Elections
  • Loading...

More Telugu News