Arvind Kejriwal: ప్రేమ వివాహం చేసుకున్న కేజ్రీవాల్ కూతురు.. స్టెప్పులేసిన పంజాబ్ సీఎం

Arvind Kejriwals Daughters Wedding

  • తన ప్రియుడు సంభవ్ జైన్ ను పెళ్లాడిన కేజ్రీవాల్ కూతురు హర్షిత
  • ఐఐటీ ఢిల్లీలో చదువుతున్న సమయంలో ఇద్దరికీ పరిచయం
  • ఇటీవలే ఒక స్టార్టప్ ను ప్రారంభించిన జంట

ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత ప్రేమ వివాహం చేసుకున్నారు. తన ప్రియుడు సంభవ్ జైన్ ను హర్షిత పెళ్లాడారు. ఢిల్లీలోని కపూర్తలా హౌస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహం జరిగిన ప్రదేశం మహారాజా ఆఫ్ కపూర్తలా ఉన్న నివాసంగా గుర్తింపు పొందింది. 

కూతురు వివాహాన్ని కేజ్రీవాల్ దగ్గరుండి తన చేతుల మీదుగా జరిపించారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తదితర ప్రముఖులు వచ్చేశారు. సంగీత్ కార్యక్రమంలో సీఎం భగవంత్ మాన్ బాంగ్రా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. 

మరోవైపు హర్షిత, సంభవ్ జైన్ ఇద్దరూ ఐఐటీ ఢిల్లీలో చదువుతున్న సమయంలో పరిచయం అయ్యారు. ఈ క్రమంలో వారి స్నేహం ప్రేమగా మారింది. వీరిద్దరూ ఇటీవలే ఒక స్టార్టప్ ను కూడా ప్రారంభించారు.

Arvind Kejriwal
Harshita Kejriwal
Sanbhav Jain
Love Marriage
IIT Delhi
Punjab CM Bhagwant Mann
Delhi
Kapurthala House
Startup
Political Wedding

More Telugu News