Delhi building collapse: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. నలుగురి మృతి.. వీడియో ఇదిగో!

Delhi Building Collapse Four Killed Several Trapped

  • ముస్తఫాబాద్‌లో ఈ తెల్లవారుజామున కూలిన భవనం
  • శిథిలాల కింద మరో 10 మంది
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు (ఎన్‌డీఆర్ఎఫ్) సహాయక చర్యలు ప్రారంభించారు. 

భవనం కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారని, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘటన జరిగిందని, ఇప్పటి వరకు 14 మందిని రక్షించామని, వారిలో నలుగురు తీవ్ర గాయాలతో మృతి చెందారని తెలిపారు. శిథిలాల కింద ఇంకా 8-10 మంది చిక్కుకుని ఉన్నారని వివరించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.

Delhi building collapse
Mustafaabad building collapse
Delhi building incident
Four deaths in Delhi building collapse
Building collapse video
NDRF rescue operation
Delhi accident
India building collapse

More Telugu News