Abids Hyderabad: ఆబిడ్స్‌లో కుప్పకూలిన భారీ క్రేన్.. పలు వాహనాలు ధ్వంసం

Massive Crane Collapse in Abids Hyderabad

  • ఆబిడ్స్‌లో ప్రమాదవశాత్తు కుప్పకూలిన భారీ క్రేన్ 
  • అక్కడ ఉన్న వాహనాలు ధ్వంసం
  • పెనుప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు 

హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో పెను ప్రమాదం తప్పింది. ఓ భారీ భవన నిర్మాణంలో వినియోగిస్తున్న క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడ నిలిపి ఉంచిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ప్రజలెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. 

దీంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనాలు ధ్వంసం కావడంతో భారీగా నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. 

Abids Hyderabad
Crane Collapse
Vehicle Damage
Construction Accident
Hyderabad Accidents
Abids Incident
Building Construction
Heavy Crane
  • Loading...

More Telugu News