A R Rahman: ఇప్పుడు ఈ కారు ట్రెండింగ్... ఏఆర్ రెహమాన్ కూడా కొనేశాడు!

AR Rahman Buys Trending Mahindra Electric Car

  • మహేంద్ర కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసిన ఏఆర్ రెహమాన్
  • ఈ కారు ధర సుమారు 25 నుండి 35 లక్షల వరకూ ఉంటుందని అంచనా
  • కారు కొనుగోలు విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఏఆర్ రెహమాన్

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ధోరణి కొనసాగుతున్న విషయం విదితమే. పెట్రోల్, డీజిల్ వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాహనాల కాలుష్యాన్ని నివారించేందుకు చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఒక ఖరీదైన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ 9 మోడల్ కారును కొనుగోలు చేసిన ఆయన, ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. దీని ధర సుమారు 25 నుంచి 35 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

అయితే, రెహమాన్ మహీంద్రా సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడం వెనుక మార్కెటింగ్ ప్రయోజనం కూడా ఉందని భావిస్తున్నారు. ఈ మోడల్‌తో పాటు బీఎస్ 6 మోడల్ కారులో సౌండింగ్ కోసం రెహమాన్ పనిచేశారు. రెహమాన్ తాను కొనుగోలు చేసిన కారులో డాల్బీ అట్మాస్ సౌండింగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 

A R Rahman
AR Rahman car
Mahindra XUV9 EV
Electric Vehicle
EV car
Trending Electric Car
Luxury Electric Car
Dolby Atmos Sound
Celebrity Car Purchase
Indian Electric Car Market
  • Loading...

More Telugu News