RCB: ఎట్టకేలకు ప్రారంభమైన మ్యాచ్... ఆర్సీబీ విలవిల

బెంగళూరులో వర్షం కారణంగా ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. సమయం లేకపోవడంతో ఓవర్లను 14కి కుదించారు. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు టీమ్ మొదట బ్యాటింగ్ కు దిగింది.
అయితే, పిచ్ పై తేమ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న పంజాబ్ బౌలర్లు చెలరేగిపోయారు. దాంతో ఆర్సీబీ 42 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఆర్సీబీ స్కోరు 9 ఓవర్లలో 7 వికెట్లకు 43 పరుగులు. క్రీజులో టిమ్ డేవిడ్ (6 బ్యాటింగ్), భువనేశ్వర్ కుమార్ (1 బ్యాటింగ్) ఉన్నారు.
పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, మార్కో యన్సెన్ 2, చహల్ 2, బార్లెట్ 1 వికెట్ తీశారు.