Chhattisgarh Maoists Surrender: ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది మావోయిస్టుల లొంగుబాటు

- సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయిన నక్సలైట్లు
- లొంగిపోయిన వారిలో 9 మంది మహిళలు
- 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 12 మందిపై రూ. 40 లక్షల రివార్డు ఉందని సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ వెల్లడించారు. వీరంతా పలు హింసాత్మక, విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నట్లు తెలిపారు.
లొంగిపోయిన వారిలో మావోయిస్టు మిలిటరీ డిప్యూటీ కమాండర్ ముచాకి జోగా, అతని భార్య, స్క్వాడ్ సభ్యురాలు ముచాకీ జోగి ఉన్నారని తెలిపారు. వీరిపై రూ. 8 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు దేవే, దుధి భుద్రాలపై ఒక్కొక్కరిపై రూ. 5 లక్షల రివార్డు ఉందని తెలిపారు.
మరో ఏడుగురిపై రూ. 2 లక్షల రివార్డు, ఒకరిపై రూ.50 వేల రివార్డు ఉందని వెల్లడించారు. వీరందరికీ ఒక్కొక్కరికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. వీరికి ప్రభుత్వ పునరావాస పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు.