Karthi: కన్నె స్వామిగా శబరిమలకు రావడం సంతోషంగా ఉంది: హీరో కార్తి

- అయ్యప్ప స్వామిని నిన్న రాత్రి దర్శించుకున్న కార్తి
- ఇరుముడి సమర్పించడం కోసం ఇక్కడకు వచ్చానన్న కార్తి
- 2015 నుంచి శబరిమలకు వస్తున్నానన్న రవి మోహన్
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నిన్న రాత్రి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల తాను స్వామి మాలను ధరించానని చెప్పారు. ఇరుముడి సమర్పించడం కోసం శబరిమలకు వచ్చానని తెలిపారు. కన్నె స్వామిగా ఇక్కడకు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో కూడా స్వామి దర్శనానికి రావాలని ఉందని తెలిపారు. పవళింపు సేవ సమయంలో స్వామిని దర్శించుకోవడం ప్రత్యేకంగా అనిపించిందని చెప్పారు.
మరో కోలీవుడ్ నటుడు రవి మోహన్ కూడా అయ్యప్పను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే పలుమార్లు శబరిమలకు వచ్చానని తెలిపారు. 2015 నుంచి ఇక్కడకు వస్తున్నానని... తొమ్మిది సార్లు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నానని చెప్పారు. స్వామిపై తనకు ఎంతో నమ్మకం ఉందని... మాల వేసుకుంటున్నప్పటి నుంచి తన జీవితంలో ఎంతో మంచి జరిగిందని తెలిపారు.