Ravinder Naidu: టీటీడీ ఈవో బంగ్లాలో పాము... సిబ్బంది చేతికి కాటు వేసిన పాము

- తిరుపతిలోని టీటీడీ ఈవో బంగ్లాలోకి దూరిన నాగుపాము
- పామును పట్టుకుని గోనె సంచెలో వేస్తుండగా కాటు వేసిన వైనం
- తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స
టీటీడీ ఈవో శ్యామలరావు నివాసం ఉండే తిరుపతిలోని బంగ్లాలోకి నిన్న రాత్రి భారీ నాగుపాము దూరింది. పామును పట్టుకునేందుకు టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి రవీందర్ నాయుడు బంగ్లాకు వచ్చారు. చాకచక్యంగా పామును పట్టుకుని గోనె సంచెలో వేస్తుండగా... ఊహించని విధంగా ఆయన చేతిపై పాటు కాటు వేసింది. అక్కడున్న సిబ్బంది వెంటనే ఆయనను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు యాంటీ వీనమ్ మందులతో చికిత్స చేశారు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ప్రస్తుతం రవీందర్ నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.