Bengaluru Youth: రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్.. కటకటాల వెనక్కి పంపిన పోలీసులు

రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్స్ చేసిన యువకుడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. బెంగళూరులోని మగడి రోడ్డులో జరిగిందీ ఘటన. ఈ నెల 12న ఓ యువకుడు రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్ చేశాడు. అనంతరం దానిని తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశాడు.
అది కాస్తా వైరల్ అయి పోలీసుల దృష్టికి చేరడంతో యువకుడికి శ్రీకృష్ణ జన్మస్థానమే గతి అయింది. రీల్ ద్వారా నిందితుడిని ట్రాక్ చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.