Mohanlal: ఓటీటీలోకి వస్తున్న ఎల్2: ఎంపురాన్... ఎప్పుడు, ఎక్కడంటే...!

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఎల్2: ఎంపురాన్'. ఇది బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 24 నుంచి ఎల్2: ఎంపురాన్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అలరించనుంది.
గతంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన లూసిఫర్ కు సీక్వెల్ గా ఎల్2 ఎంపురాన్ తెరకెక్కింది. ఈ చిత్రం మార్చి 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ చిత్రం 4 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.
