Sunrisers Hyderabad: ముంబయి ఇండియన్స్ తో సన్ రైజర్స్ ఢీ... టాస్ కబురు ఇదిగో!

- ఐపీఎల్ లో ఇవాళ ఆసక్తికర మ్యాచ్
- ముంబయి వాంఖెడే స్టేడియంలో పోరు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
- సన్ రైజర్స్ కు మొదట బ్యాటింగ్
ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఇటీవల పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ద్వారా మళ్లీ గెలుపు బాట పట్టింది. నేడు సన్ రైజర్స్ జట్టు ముంబయి ఇండియన్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదిక. సొంతగడ్డపై టాస్ గెలిచిన ముంబయి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో సన్ రైజర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
హైదరాబాద్ మేనేజ్ మెంట్ గత మ్యాచ్ లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్ కు బరిలో దించుతోంది. మరోవైపు, ముంబయి జట్టులోనూ ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంకేతాలు ఇచ్చాడు.
ఈ టోర్నీలో సన్ రైజర్స్, ముంబయి ఇండియన్స్ జట్ల ప్రస్థానం ఒకేలా సాగుతోంది. సన్ రైజర్స్ 6 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు సాధించగా, ముంబయి కూడా 6 మ్యాచ్ ల్లో రెండు విజయాలు నమోదు చేసింది. అయితే, రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో ముంబయి 7వ స్థానంలో ఉండగా, సన్ రైజర్స్ 9వ స్థానంలో ఉంది.