Travis Head: రోహిత్‌ను చూసి చాలా నేర్చుకున్నా: ట్రావిస్ హెడ్

- మరికాసేపట్లో ఎంఐ, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్
- ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రోహిత్‌పై హెడ్ ప్రశంసలు
- హిట్‌మ్యాన్ ఆటను చూస్తూ ఎంజాయ్ చేస్తానన్న సన్‌రైజర్స్ ఓపెనర్
ముంబయి ఇండియన్స్ (ఎంఐ) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రశంసలు కురిపించాడు. ముంబయిలోని వాంఖడేలో ఈరోజు ఇరుజట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విధ్వంసకర ఓపెనర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... "హిట్‌మ్యాన్‌తో ఎప్పుడూ సమయం స్పెండ్ చేయలేకపోయినా అతడిని చూసి చాలా నేర్చుకున్నా. రోహిత్ క్రికెట్ ఆడే విధానం చాలా ప్రత్యేకం. అతడి ఆటను చూస్తూ ఎంజాయ్ చేస్తా. రెండేళ్లుగా కెప్టెన్‌గా, ఓపెనర్‌గా టీమిండియాను నడిపిస్తున్న విధానం స్ఫూర్తిదాయకం" అని హెడ్ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సీజన్‌లో ఎంఐ, ఎస్ఆర్‌హెచ్ రెండు జట్లు కూడా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేదనే చెప్పాలి. ముంబయి ఆడిన 6 మ్యాచ్‌లలో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంటే... హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో ఉంది. అయితే, ఈ రెండు టీమ్స్ తాము ఆడిన తమ ఆఖరి మ్యాచ్‌లను విజయాలతో ముగించాయి. అంతకుముందు వరుస పరాజయాలతో సతమతమైన ఇరు జట్లు ఎట్టకేలకు గెలుపు బాటపట్టాయి. దీంతో ఇవాళ్టి మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.