Sensex: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు... 1,508 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

- ఫైనాన్షియల్ స్టాక్స్ మద్దతుతో రాణించిన సూచీలు
- కలిసివచ్చిన విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు
- 414 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా లాభపడ్డాయి. ఫైనాన్షియల్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కూడా సూచీలను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,508 పాయింట్ల లాభంతో 78,553కు ఎగబాకింది. నిఫ్టీ 414 పాయింట్లు పెరిగి 23,851కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
ఐసీఐసీఐ బ్యాంక్ (3.68%), భారతి ఎయిల్ టెల్ (3.63%), సన్ ఫార్మా (3.50%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.28%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.24%).
టెక్ మహీంద్రా (-0.24%), మారుతి (-0.04%) నష్టపోయాయి.