Delhi Capitals: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఢిల్లీ కేపిటల్స్

Delhi Capitals Create History in IPL

  • సూపర్ ఓవర్లలో నాలుగుసార్లు విజయం సాధించిన జట్టుగా ఢిల్లీ రికార్డు
  • ఇప్పటి వరకు మూడు విజయాలతో పంజాబ్ కింగ్స్ పేరిట రికార్డు
  • అత్యధిక టై మ్యాచ్‌లు ఆడిన జట్టుగానూ ఢిల్లీ పేరిట మరో రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు చరిత్ర సృష్టించింది. రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్‌లో ఢిల్లీ అనూహ్యంగా విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. సూపర్ ఓవర్‌లో ఓ జట్టు ఇన్నిసార్లు విజయం సాధించడం ఇదే తొలిసారి.

ఈ రికార్డు ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ పేరిట ఉండేది. పంజాబ్ కింగ్స్ మూడుసార్లు సూపర్ ఓవర్లలో విజయం సాధించింది. ఇప్పుడా రికార్డును ఢిల్లీ చెరిపేసింది. అంతేకాదు, మరో రికార్డును కూడా ఢిల్లీ సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు అంటే ఐదు టై మ్యాచ్‌లు ఆడిన జట్టుగానూ మరో రికార్డు సాధించింది. ఇక, ఢిల్లీ, పంజాబ్ తర్వాత ముంబై, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలా రెండుసార్లు సూపర్ ఓవర్లలో విజయం సాధించాయి. 

Delhi Capitals
IPL
Super Over
Record
Tie Match
Rajasthan Royals
Punjab Kings
Mumbai Indians
Royal Challengers Bangalore
Cricket
  • Loading...

More Telugu News