Sudhakar Yadav: రామగిరి ఎస్సైకు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు

Ramagiri SI Receives Threatening Calls and Messages

  • పోలీసుల గుడ్డలు ఊడదీస్తానన్న జగన్
  • జగన్ కు కౌంటర్ ఇచ్చిన రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్
  • ఎస్సైపై అసభ్యకర మెసేజ్ లు పెడుతున్న వైనం

ఇటీవల రాప్తాడు నియోజకర్గం పర్యటన సందర్భంగా పోలీసులపై వైసీపీ అధినేత జగన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల బట్టలు ఊడదీస్తామంటూ ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ గురించి నేరుగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలకు ఎస్సై సుధాకర్ కూడా కౌంటర్ ఇచ్చారు. 

అప్పటి నుంచి సుధాకర్ కు వైసీపీ నేతలు, కార్యకర్తల నుంచి బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయి. అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. చంపేస్తామని బెదిరిస్తున్నారు. కుటుంబ సభ్యుల గురించి కూడా అనుచితంగా మాట్లాడుతున్నారు. దీంతో, జిల్లా ఎస్పీకి సుధాకర్ యాదవ్ ఫిర్యాదు చేశారు. తనను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఐడీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. 

Sudhakar Yadav
Ramagiri SI
YCP
Jagan Mohan Reddy
Threatening Calls
Cybercrime
Police Complaint
Andhra Pradesh
Political Violence
Social Media Threats
  • Loading...

More Telugu News