Lin Jian: ఈ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికానే: 245 శాతం టారిఫ్‌పై స్పందించిన చైనా

China Responds to 245 US Tariffs America Started This War
  • అమెరికా సుంకాలపై చైనా ప్రతిస్పందించిందన్న చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి
  • సుంకాలు, వాణిజ్య యుద్ధాల్లో విజేత అంటూ ఎవరూ ఉండరని వ్యాఖ్య
  • టారిఫ్ యుద్ధాన్ని చైనా కోరుకోవడం లేదు.. కానీ బెదిరేది లేదన్న చైనా ప్రతినిధి
అమెరికా దిగుమతి వస్తువులపై సుంకాన్ని 245 శాతానికి పెంచడంపై చైనా స్పందించింది. టారిఫ్ పెంపు గురించి అమెరికానే అడగాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అన్నారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. టారిఫ్ యుద్ధాన్ని మొదట ప్రారంభించింది అమెరికానే అని లిన్ జియాన్ వెల్లడించారు.

చైనా తన చట్టబద్ధమైన హక్కులను, ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన విధంగా ప్రతిస్పందించిందని అన్నారు. చైనా ప్రతిస్పందన సహేతుకమైనది, చట్టబద్ధమైనదని లిన్ జియాన్ పేర్కొన్నారు. సుంకాలు మరియు వాణిజ్య యుద్ధాల్లో విజేత అంటూ ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. ఇలాంటి టారిఫ్ యుద్ధాలను చైనా కోరుకోవడం లేదని, కానీ తమను బెదిరించాలని చూస్తే మాత్రం బెదిరే ప్రసక్తే లేదని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వాణిజ్యానికి సంబంధించి చైనా చేతులు కలపడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ టారిఫ్ యుద్ధం అమెరికా నుంచి ప్రారంభమైందని పేర్కొన్నారు.
Lin Jian
China-US Trade War
Tariffs
Trade Dispute
US Tariffs on China
China's Response to Tariffs
Global Trade
Economic Sanctions
International Trade Relations

More Telugu News