Hissar Murder: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసిన వైనం.. వీడియో ఇదిగో!

Wife Kills Husband with Lover Disposes Body in Drainage
  • భర్త వద్దన్నా వినకుండా మరొకరితో కలిసి యూట్యూబ్ వీడియోలు
  • ఓ రోజు ఇద్దరూ అభ్యంతరకర స్థితిలో కనబడడంతో భర్త ఆగ్రహం
  • ఇద్దరూ కలిసి భర్తను చంపేసి, మృతదేహాన్ని ఊరవతల పడేసిన వైనం
హర్యానాలోని హిస్సార్ లో ఘోరం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి అభ్యంతరకరస్థితిలో భర్తకు దొరికిపోయిన ఓ మహిళ.. ప్రియుడి సాయంతో భర్తను కడతేర్చింది. తన దుపట్టాతో ఉరి బిగించి దారుణంగా హతమార్చింది. రాత్రి ఊరంతా నిద్రించే దాకా ఆగి, ప్రియుడి బైక్ పై భర్త మృతదేహాన్ని తీసుకెళ్లి ఊరు బయట ఉన్న డ్రైనేజీలో పడేసి వచ్చింది. ఆపై తనకేమీ తెలియనట్లు నటించింది. అయితే, సీసీటీవీ కెమెరాల ఫుటేజీలతో ఆమె గుట్టురట్టయింది. ప్రస్తుతం ఆ హంతక ప్రేమికులు ఇద్దరూ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు.

అసలేం జరిగిందంటే..
హిస్సార్ జిల్లాలోని ప్రేమ్ నగర్ కు చెందిన రవీనా అనే వివాహితురాలు డిజిటల్ కంటెంట్ క్రియేటర్.. ఇన్ స్టాలో తనకు 34 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్ స్టాలో పరిచయమైన సురేశ్ తో కలిసి వీడియోలు తీసి యూట్యూబ్, ఇన్ స్టాలలో అప్ లోడ్ చేసేది. దీనిపై రవీనా భర్త ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. పరాయి పురుషుడితో కలిసి వీడియోలు తీయొద్దని, కుటుంబం పరువు తీయవద్దని అడ్డుచెప్పాడు. రవీనా మాత్రం అతని మాట వినలేదు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

మార్చి 25న రవీనా, సురేశ్ లు సన్నిహితంగా ఉన్న సమయంలో ప్రవీణ్ ఇంటికి వచ్చాడు. వారిని ఆ స్థితిలో చూసి గొడవపడ్డాడు. అప్పటికే భర్త తీరుతో విసిగిపోయిన రవీనా.. అతడిని అడ్డు తొలగించుకుంటే సురేశ్ తో కలిసి సంతోషంగా వీడియోలు చేసుకుంటూ ఉండవచ్చని భావించింది. సురేశ్ తో కలిసి భర్త ప్రవీణ్ మెడచుట్టూ తన దుపట్టా బిగించి చంపేసింది. ఆపై మృతదేహాన్ని దాచి ఇంట్లో వాళ్ల ముందు మామూలుగానే ఉన్నట్లు నటించింది. 

అదేరోజు అర్ధరాత్రి దాటాక ప్రవీణ్ మృతదేహాన్ని సురేశ్, రవీనాలు బైక్ పై తీసుకెళ్లి ఊరు బయట ఉన్న డ్రైనేజీలో పడేసి వచ్చారు. వారం రోజుల తర్వాత డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఓ జంట ఈ మృతదేహాన్ని పడవేసి వెళ్లడం కనిపించింది. అనుమానంతో రవీనా, సురేశ్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్ లో ప్రశ్నించగా.. తాము చేసిన దారుణాన్ని నిందితులు బయటపెట్టారు.
Hissar Murder
Haryana Crime
Ravina
Suresh
Praveen
Digital Content Creator
Instagram Influencer
Murder Case
Couple Arrested
CCTV Footage

More Telugu News