Khushbu: ట్రోలర్స్‌కు ఖుష్భూ స్ట్రాంగ్ కౌంటర్

Khushbus Strong Counter to Trolls

  • న్యూలుక్ ఫోటోలు షేర్ చేసిన ఖుష్బూ
  • ఖుష్బూ ఫోటోలపై రకరకాలుగా కామెంట్స్ చేసిన నెటిజన్లు
  • ట్రోలర్స్‌పై మండిపడ్డ ఖుష్బూ
  • మీ తల్లిదండ్రులను చూస్తుంటే జాలి వేస్తోందని వ్యాఖ్య

ట్రోలర్లపై నటి ఖుష్బూ తీవ్రంగా స్పందించారు. ఖుష్బూ తాజాగా తన న్యూలుక్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే, ఆమె చాలా సన్నగా కనిపించడంతో కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. దీనిపై ఆమె గట్టిగా బదులిచ్చారు.

ఖుష్బూ తను షేర్ చేసిన ఫోటోలకు ‘బ్యాక్ టు ద ఫ్యూచర్’ అనే క్యాప్షన్ పెట్టారు. దీనిపై కొందరు నెటిజన్లు ఆమె సన్నబడిన తీరును ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం సన్నగా మారడానికి ఇంజెక్షన్స్ చేయించుకున్నారని, వాటి మాయ వల్లనే ఇలా మారిపోయారని, వాటి గురించి ఫాలోవర్స్‌కు కూడా చెప్పండి అంటూ రకరకాలుగా కామెంట్స్ పెట్టారు.

ఈ కామెంట్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఖుష్బూ.. వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. "మీరెటువంటి మనుషులు? మీరెప్పుడూ మీ ముఖాలను సోషల్ మీడియాలో పంచుకోరు. ఎందుకంటే మీరు అంత అసహ్యంగా ఉంటారు. మీ తల్లిదండ్రులను చూస్తుంటే జాలి వేస్తోంది" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Khushbu
Khushbu Sundar
Troll
Social Media
Weight Loss
Strong Response
Netizens
Actress Khushbu
Body Shaming
Social Media Trolling

More Telugu News