Yuzvendra Chahal: చాహల్ అద్భుత ప్రదర్శనపై మహ్ వశ్ రియాక్షన్ ఇదే..!

--
కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అద్భుతమైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. తన స్పిన్ మాయాజాలంతో కీలకమైన నాలుగు వికెట్లు తీసి పంజాబ్ జట్టును విజయతీరానికి చేర్చాడు. ఈ సందర్భంగా చాహల్ స్నేహితురాలు, రేడియో జాకీ మహ్ వశ్ తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఫొటో వైరల్ గా మారింది. చాహల్ తో దిగిన సెల్ఫీని అప్ లోడ్ చేసిన మహ్ వశ్.. ‘మామూలు టాలెంట్ కాదిది.. అద్భుతమైన, అసాధారణ టాలెంటెడ్ మ్యాన్. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచావు. అసంభవ్’ అంటూ క్యాప్షన్ జత చేసింది.
భార్య ధనశ్రీతో చాహల్ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆర్ జే మహ్ వశ్, చాహల్ జంటగా కనిపిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లను చాహల్, మహ్ వశ్ కలిసి వీక్షించారు. ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే, వారు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు. మహ్ వశ్ తనకు మంచి స్నేహితురాలని చాహల్ ఓ సందర్భంలో తెలిపాడు. ఐపీఎల్ మ్యాచ్ లలో చాహల్ ఆడుతున్న మ్యాచ్ లను మహ్ వశ్ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షిస్తోంది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.