Pakistan: వక్ఫ్ చట్టంపై పాక్ వ్యాఖ్యలు... భారత్ కౌంటర్ ఇలా..

India Rejects Pakistans Criticism of Wakf Amendment Bill
  • వక్ఫ్ సవరణ చట్టంపై పాకిస్థాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ మంత్రి 
  • భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం పాకిస్థాన్ కు లేదన్న కేంద్ర మంత్రి
వక్ఫ్ సవరణ చట్టంపై పాకిస్థాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఒక వర్గం వారి ఆస్తులకు దూరం చేయడానికే భారత్ ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని పాకిస్థాన్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్ కత్ అలీ పేర్కొన్నారు. ఇది మైనారిటీలను కించపరచడమేనని ఆయన అన్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. దీనిపై తాజాగా భారత్ ధీటుగా స్పందించింది.

భారత పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుపై పాకిస్థాన్ చేసిన ప్రేరేపిత, నిరాధార వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం పాకిస్థాన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. మైనారిటీలకు రక్షణ కల్పించే విషయంలో ఇతరులకు బోధించే బదులు పాక్ తన అధ్వాన్నమైన రికార్డును చూసుకోవాలని సూచించారు. 
Pakistan
India
Wakf Amendment Bill
Shafqat Ali
Randeep Jaiswal
Bilateral Relations
Minority Rights
India-Pakistan Relations
International Affairs
South Asia

More Telugu News