Sadayappa Swami Temple: వేలంలో రూ.25 వేలు పలికిన నిమ్మకాయ

Record Price for Lemon at Tamil Nadu Temple Auction

  • తమిళనాడులోని ఈరోడ్‌లోని ఓ దేవాలయంలో వేలం
  • సదాయప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
  • స్వామివారి పూజలో ఉంచిన నిమ్మకాయను వేలం వేసిన అధికారులు

తమిళనాడులో ఒక నిమ్మకాయ వేలం పాటలో రూ. 25 వేలు పలికింది. తమిళనాడు నూతన సంవత్సరం సందర్భంగా ఈరోడ్ జిల్లాలోని శివగిరిలో గల సదాయప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి పూజలో ఉంచిన నిమ్మకాయను ఆలయ అధికారులు వేలం వేశారు.

ఈ వేలంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కందసామిపాలెం నుంచి వచ్చిన ఒక భక్తుడు రూ. 25 వేలకు ఆ నిమ్మకాయను సొంతం చేసుకున్నారు. తమిళనాడు నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామి వారి పూజకు ఉపయోగించిన సామగ్రిని వేలం వేయడం ఆనవాయతీ అని ఆలయ అధికారులు తెలిపారు.

Sadayappa Swami Temple
Erode District
Tamil Nadu New Year
Lemon Auction
Sivagiri Temple
Tamil Nadu
Auction
Religious Ceremony
Temple Auction
India
  • Loading...

More Telugu News