Dil Raju: రేపు దిల్ రాజు నుంచి భారీ అనౌన్స్‌మెంట్... 'బోల్డ్... బిగ్... బియాండ్ ఇమాజినేషన్' అంటూ ట్వీట్!

- ఎక్స్ లో ఎస్వీసీ ఆసక్తికర పోస్టు
- బోల్డ్.. బిగ్.. బియాండ్ ఇమాజినేషన్' అంటూ ట్వీట్
- ఫిల్మ్ నగర్ వర్గాల్లో భారీగా చర్చ
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నుంచి రేపు ఓ భారీ అనౌన్స్‌మెంట్ రానుంది. ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఈ విషయాన్ని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. ఈ మేరకు "బోల్డ్... బిగ్... బియాండ్ ఇమాజినేషన్" అంటూ ట్వీట్ చేసింది. రేపు ఉదయం 11.08 గంటలకు ఈ భారీ ప్రకటన ఉంటుందని తన 'ఎక్స్' పోస్టులో ఎస్‌వీసీ పేర్కొంది.
కాగా, ఇటీవల ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌కు ఓ ఆసక్తికర స్టోరీ లైన్ వినిపించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు వచ్చే ప్రకటన ఈ ప్రాజెక్ట్ గురించేనా అన్న చర్చ ఫిల్మ్ వర్గాల్లో నడుస్తోంది. ఏదేమైనా రేపు ఉదయం 11.08 గంటలకు ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది.