Axar Patel: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ కు భారీ జరిమానా

- అక్షర్ పటేల్ కు రూ.12 లక్షల జరిమానా విధించిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ
- ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ అతనికి జరిమానా విధించింది. రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.
ఐపీఎల్ - 2024లో ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తమ 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ నియమావళి ప్రకారం ఢిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్‌కు జరిమానా విధించింది. ఈ మేరకు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న ఆరో కెప్టెన్‌గా అక్షర్ పటేల్ నిలిచారు. ఈ జాబితాలో ఇంతకు ముందు సంజూ శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రజత్ పాటిదార్ ఉన్నారు.