Sree Satya: అప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను: శ్రీసత్య

- యూత్ లో 'శ్రీసత్య'కి మంచి క్రేజ్
- సినిమాలపై ఫోకస్ పెట్టిన శ్రీ సత్య
- ఇండస్ట్రీలో ఉండాల్సింది లక్ అని వ్యాఖ్య
- ఆ రోజున అవమానం జరిగిందని వెల్లడి
బుల్లితెర ముందు కూర్చునేవారిలో చాలామందికి 'శ్రీసత్య'తెలుసు. సీరియల్స్ .. టీవీ షోస్ తో బిజీగా ఉంటూ వచ్చిన శ్రీసత్య, 'బిగ్ బాస్' తరువాత నుంచి మరింత పాప్యులర్ అయింది. ప్రస్తుతం ఆమె సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టింది. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ వారితో మాట్లాడుతూ .. "సీరియల్స్ లో చేస్తూ ఉంటే, సినిమాలలో అవకాశాలు ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారు. అందువలన కొంతకాలంగా సీరియల్స్ మానేయడం జరిగింది. ఇది నాకు ఎదురైన అనుభవం మాత్రమే" అని ఆమె అంది.
"అవకాశాల కోసం నేను సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. అయితే నేను సినిమాల పట్ల అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదని కొంతమంది దర్శకులకు కొంతమంది చెప్పడం వలన కొన్ని అవకాశాలు కోల్పోయాను. నన్ను సంప్రదించకుండానే వాళ్లు అలా ఎలా చెప్పారనేది నాకు తెలియలేదు. నా జీవితం సముద్రమైతే, అందులో ఉప్పంత దరిద్రం ఉంది. ఇండస్ట్రీలో నిలబడాలంటే లక్ ఉండాలి .. అదే నాకు లేదు" అని చెప్పింది.
" అది నా ఫస్టు టీవీ సీరియల్. షూటింగ్ స్పాట్ కి మినీ ఫ్యాన్ తీసుకుని వెళ్లాలని కూడా నాకు తెలియదు. చెమటలు బాగా పోస్తూ ఉంటే, ఒక్క ఐదు నిమిషాలు ఏసీలో ఉన్న తరువాత కెమెరా ముందుకు రమ్మని చెప్పి, ఏసీ రూమ్ కి తీసుకుని వెళ్లారు. ఆ రూమ్ లో ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఆమె చాలా సినిమాలలోను చేశారు కూడా. 'ఎవరిని పడితే వాళ్లను లోపలికి ఎందుకు తీసుకుని వస్తున్నారు .. బయటికి పంపించండి' అన్నారు. అప్పుడు మాత్రం నాకు చాలా బాధకలిగింది" అని అంది.